Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మళ్లీ మెగా ఫోన్ పడుతోన్న పోసాని

  • రచయితగా పోసానికి మంచిపేరు 
  • దర్శకుడిగా వైవిధ్యభరిత చిత్రాలు 
  • నటుడిగా విలక్షణ పాత్రలు  
సినీ రచయితగా .. దర్శకుడిగా .. నటుడిగా పోసాని తనదైన ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారు. దర్శకుడిగా విజయాలను ఎక్కువగా అందుకోలేకపోయిన ఆయన, నటుడిగా బిజీ అయ్యారు. విలక్షణమైన పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో పోసాని లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ఆయన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకువెళుతున్నారు.

ఇక ఆయన దర్శకత్వం జోలికి వెళ్లనట్టేనని అంతా అనుకున్నారు. కానీ ఆయన త్వరలో మెగాఫోన్ పట్టే ప్రయత్నంలో ఉన్నాడనేది తాజా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల ఆధారంగా ఆయన ఒక కథను సిద్ధం చేసుకున్నాడట. ఈ కథను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, మే నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. ఏపీలో ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 
Posani Krishna Murali

More Telugu News